భూమిని వర్ణించే శాస్త్రమే భూగోళశాస్త్రం. దీన్ని ఆంగ్లంలో "Geography" అంటారు. ఈ పదము 2 గ్రీకు పదాల కలయికతో ఏర్పడినది. Geo అంటే భూమి. Graphe అంటే వర్ణన. ఈ వర్ణన 18 వ శతాబ్దంలో కొత్తగా కనుక్కున్న భూభాగాలు, సముద్రపు మార్గాల వల్ల ఒక శాస్త్రముగా మారింది. Geography అనే పదాన్ని మొదట ఉపయోగించినది "ఎరతోస్తీన్స్".
విశ్వం మొత్తం వేడి వాయువులతో ఏర్పడి చలనసహితముగా ఉన్న మేఘల్లాంటి ఖగోళవస్తువులతో నిండి ఉంది. వీటినే "నిహారికలు"(Nebulas) అంటారు. ఈ నిహారికలు నక్షత్రాలకు జన్మస్థానం. కొన్ని కోట్ల నక్షత్రాల సమూహాలను "గెలాక్సీ" అంటారు.
ప్రతి నక్షత్రంలో శక్తి జనించడానికి కారణమయ్యే వాయువులలో ముఖ్యమైనవి హైడ్రోజన్, హీలియం. కేంద్రక సంలీనం ద్వారా విడుదలయ్యే శక్తి వల్ల నక్షత్రాలు ప్రకాశవంతముగా కనిపిస్తాయి. ఈ వాయువులు అవసాన దశకు చేరినపుడు నక్షత్రాలు 10 రెట్లు ఎక్కువ ఉష్ణాన్ని, కాంతిని విడుదల చేస్తూ, చివరికి విస్పోటం చెందుతాయి. ఈ ప్రక్రియనే "సూపర్ నోవా" అంటారు. ఈ విస్పోటం వల్ల సమీప ఖగోళ పదార్థాలు గాఢ అంధకారంలోకి నెట్టివేతకు గురవుతాయి. వీటినే "కృష్ణ బిలాలు"(బ్లాక్ హోల్స్) అంటారు. కృష్ణ బిలాలను మొదట ఉహించినది "ఐన్ స్టీన్". శాస్త్రీయముగా కనిపెట్టినది "స్టీఫెన్ హాకిన్స్".
భూమికి దగ్గరలో ఉన్న 2వ నక్షత్రం "ప్రాక్సిమా సెంటురి"(Proxima Centuari). ఇది 38 మిలియన్ మిలియన్ల కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ నక్షత్రం నుంచి
కాంతి భూమిని చేరడానికి దాదాపు నాలుగేళ్లు పడుతుంది.
శూన్యంలో సెకనుకి 2,99,793 కి. మీ. వేగంతో ప్రయాణించగల కాంతి
ఒక సంవత్సరంలో ప్రయాణించే దూరాన్ని "కాంతి సంవత్సరం" (Light Year)అంటారు.
ఒక కాంతి సంవత్సర దూరం (9.4605284 × 1015 meters).

0 comments:
Post a Comment