Pages

Ads 468x60px

Monday, December 28, 2015

General Studies - Question & Answer - 1

ప్రశ్న : చింతపండు చూస్తే నీళ్ళు ఊరుతాయేం?
జవాబు : మనకు బాగా ఆకలిగా ఉన్నపుడు నోటితో ఏ రుచులైతే ఎక్కువ ప్రేరేపణనిస్తాయో ఆ వస్తువుల్ని, పదార్థాల్ని తలచుకున్నా, చూసినా నోట్లో నీరు(లాలాజలం) ఊరటం సహజం. మనకు తీపి రుచికన్నా, పులుపు వస్తువుల పుల్లనకు ఆమ్లత్వం ఉండటం వల్ల ఆ ఆమ్లత్వాన్ని తగ్గించేందుకు, సజళీకరణం (dilution) చేసేందుకు మనం పుల్లని వస్తువుల్ని తింటున్నపుడు నోరు అధికంగా ఊరుతుంది. ఈ స్థితికి మన శరీరం, మెదడు, మన జీర్ణవ్యవస్థ అలవాటుపడి ఉంటాయి. కాబట్టి బాగా ఆకలిగా ఉన్నపుడు ఊరగాయలు, చింతపండు వంటి పులుపు పదార్థాల్ని చూసినప్పుడు (లేదా) విన్నపుడు మెదడు నోట్లో నీరు ఊరించేలా ప్రేరేపిస్తుంది. ఇలాంటి జీవభౌతిక ధర్మాన్ని అలవాటు వల్ల వచ్చిన ప్రేరణ (conditioned reflex) అంటాం. కానీ బాగా కడుపు నిండాక చింతపండును చూసినా నోట్లో నీరు ఊరదు. conditioned reflex ఆ సమయం లో పని చేయదు. 


0 comments:

Post a Comment